Sunday 30 November 2014

మాది మేల్ కులమటంచు, మాదిమంచి మతమటంచు,

        మాది మేల్ కులమటంచు, మాది

     మంచి మతమటంచు, సాటి మనుషుల

     రక్తమరిగిన వారిని దేశభక్తులనుట

     పాడియగునే! సత్యమిది సుజనులారా!

మతసామరస్యపు చెట్టుకు పట్టిరి చెదలై

      మతసామరస్యపు చెట్టుకు పట్టిరి చెదలై

      జనం మెదళ్ళ మొదళ్ళు దొలిచిరి, ఉన్మాద

     శక్తులు కల్లోలంబు లేపిరి, జీవన స్రవంతిలొ


     కనుగొన వినదగు సత్యమిది సుజనులారా!

బొమ్మకు బొట్టుపెట్టి పట్టుబట్టలు కట్టి

  బొమ్మకు బొట్టుపెట్టి పట్టుబట్టలు కట్టి

     ధూపదీప నైవేద్యముల సంబరమెత్తిన

     సమకూరవు పనులు సాధనలేక భువిని

     కనుగొన! వినదగు సత్యమిది సుజనులారా! 

కొయ్యబొమ్మలకు పెండ్లిచేయ పుణ్యమని కోట్లు కుమ్మరించెడి అయ్యలు

    కొయ్యబొమ్మలకు పెండ్లిచేయ పుణ్య

     మని కోట్లు కుమ్మరించెడి అయ్యలు సాటి

     పేదల బాధలగోడు తీర్ప కూడరయా


     కనుగొన వినదగు సత్యమిది సుజనులారా!

Saturday 29 November 2014

గుండెల రేగడిపై గులాభి మొలిచింది



గుండెల రేగడిపై గులాభిమొలిచింది               -పిఎన్ మూర్తి (9441151762)
త్యాగపు నెత్తుటిలో జెండా వెలిసింది
విప్లవపుంతల్లో ధగధగ మెరిసింది
చీకటి బతుకులలో వెలుగులుచిమ్మింది
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది
చక్రవర్తులను మట్టు బెట్టినది
నాజి మూకను తరిమి గొట్టినది
పాపపు పాలన పాతి పూడ్చినది
సామ్యవాదమె చాటి చెప్పినది - శాంతి దీపమై వెలుగు నిచ్చినది

రజాకార్లకు ఎదురు నిలిచినది
వెట్టిచాకిరి ఎగర కొట్టినది
గడీల దొరలకు గబులు రేపినది
దున్నెవానికే భూమి పంచినది
బాంచనన్నలకు అండనిలిచినది
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది
వలస వాదమును కుళ్ళబొడిచినది
పరపీడనను పాతరేసినది
పరాయిపాలన గొంతునొక్కినది
సమర వీరుల శంఖమైనది - ఉద్యమాలకే శ్వాసనిచ్చినది
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది
అవినీతి రాజ్యమె కూల్చివేయగా
కష్టజీవుల సైన్యమెకదలగ
కార్మిక కర్షక ఐక్యత నిండగ
తల్లి భారతి సంత సించగ
నెరిపెపోరులొ ఎరుపే మెరుపై
శాంతి సౌక్యముల సమత పండగ
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది

ఉద్యమ జెండా ఎత్తర అన్న



ఆత్మగౌరవం పాలనలొ - ఆత్మహత్యలు ఏందన్న
గద్దెల పైన మనవాడున్న - బాధల దరువు ఏందన్న 
యమ బాధల దరువు ఏందన్న 

ఉత్తర దిక్కున గోదారమ్మర - పశ్చిమకనుముల కిష్ణానదిరా
పారే నదులు పక్కనవున్నా - గుక్కెడు దాహం తీరకపోయె
ఏలే రాజులు మారినగాని
నీటి ఎద్దడె మారకపోయె ''ఆత్మగౌరవం పాలనలొ''

పూటకు గంట కరెంటివ్వరు - మోటరు బోరు నడవకపోయె
పుట్టెడు వడ్లు పండిన పొలమున - పట్టెడు వడ్లు పండకపోయె
మారిరి ఒక్కరె పాలకులన్న
కరెంటు కోతలు తప్పకపోయె ''ఆత్మగౌరవం పాలనలొ''

దగా కోరుల వంచెనరయ్యో - ఎరువుల కొరత కల్తీ విత్తులు
దళారి కొడుకుల దోపిడి దాహం - రైతుల బతుకుల వీడని శాపం
ఉద్యమ పార్టీ గద్దెను ఎక్కిన 
వెనకటి పాలన మారకపోయె ''ఆత్మగౌరవం పాలనలొ''

చేసిన బాసల ఊసే లేదు - అప్పుల భారం తప్పకపోయె
రుణ మాఫీల జాప్యం చూడు - వెతలే తీరని మనుగడపోరు
నీళ్ళు నిధులు రాబట్టుటకై
నియామకాలు చేపట్టుటకై 
ఆత్మగౌరవం నిలబెట్టుటకై
ఉద్యమజెండా ఎత్తర అన్న







పిఎన్ మూర్తి (9441151762)

Thursday 27 November 2014

శాంతి సౌక్యముల సమత పండగ

శాంతి సౌక్యముల సమత పండగ
                                                              -పిఎన్ మూర్తి (9441151762)

గుండెల రేగడిపై గులాభిమొలిచింది
త్యాగపు నెత్తుటిలో జెండా వెలిసింది
విప్లవపుంతల్లో ధగధగ మెరిసింది
చీకటి బతుకులలో వెలుగులుచిమ్మింది

చక్రవర్తులను మట్టు బెట్టినది
నాజి మూకను తరిమి గొట్టినది
పాపపు పాలన పాతి పూడ్చినది
సామ్యవాదమె చాటి చెప్పినది  -
 శాంతి దీపమై వెలుగు నిచ్చినది   -గుండెల రేగడిపై గులాభి మొలిచింది

రజాకార్లకు ఎదురు నిలిచినది
వెట్టిచాకిరి ఎగర కొట్టినది
గడీల దొరలకు గబులు రేపినది
దున్నెవానికే భూమి పంచినది
బాంచనన్నలకు అండనిలిచినది
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది
వలస వాదమును కుళ్ళబొడిచినది
పరపీడనను పాతరేసినది
పరాయిపాలన గొంతునొక్కినది
సమర వీరుల శంఖమైనది -
 ఉద్యమాలకే శ్వాసనిచ్చినది
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది
అవినీతి రాజ్యమె కూల్చివేయగా
కష్టజీవుల సైన్యమెకదలగ
కార్మిక కర్షక ఐక్యత నిండగ
తల్లి భారతి సంతసించగ
నెరిపె పోరులొ ఎరుపే మెరుపై
శాంతి సౌక్యముల సమత పండగ
-గుండెల రేగడిపై గులాభి మొలిచింది

ఉద్యమ జెండా ఎత్తర అన్న
-                                                                                       పి ఎన్ మూర్తి (9441151762)

ఆత్మగౌరవం పాలనలొ - ఆత్మహత్యలు ఏందన్న
గద్దెల పైన మనవాడున్న - బాధల దరువు ఏందన్న
యమ బాధల దరువు ఏందన్న

ఉత్తర దిక్కున గోదారమ్మర - పశ్చిమకనుముల కిష్ణానదిరా
పారే నదులు పక్కనవున్నా - గుక్కెడు దాహం తీరకపోయె
ఏలే రాజులు మారినగాని
నీటి ఎద్దడె మారకపోయె ''ఆత్మగౌరవం పాలనలొ''

పూటకు గంట కరెంటివ్వరు - మోటరు బోరు నడవకపోయె
పుట్టెడు వడ్లు పండిన పొలమున - పట్టెడు వడ్లు పండకపోయె
మారిరి ఒక్కరె పాలకులన్న
కరెంటు కోతలు తప్పకపోయె                                                  ''ఆత్మగౌరవం పాలనలొ''

దగా కోరుల వంచెనరయ్యో - ఎరువుల కొరత కల్తీ విత్తులు
దళారి కొడుకుల దోపిడి దాహం - రైతుల బతుకుల వీడని శాపం
ఉద్యమ పార్టీ గద్దెను ఎక్కిన
వెనకటి పాలన మారకపోయె   ''ఆత్మగౌరవం పాలనలొ''

చేసిన బాసల ఊసే లేదు - అప్పుల భారం తప్పకపోయె
రుణ మాఫీల జాప్యం చూడు - వెతలే తీరని మనుగడపోరు
నీళ్ళు నిధులు రాబట్టుటకై
నియామకాలు చేపట్టుటకై
ఆత్మగౌరవం నిలబెట్టుటకై
ఉద్యమజెండా ఎత్తర అన్న


Wednesday 26 November 2014

తెలుగుతనం వెలుగింటన
తెలుగు జాతి ఎక్కడున్న
తెలుగు భాష ఒక్కటే
తెలసుకొని మసులుకో తెలుగోడా- తెలివిగా నడచుకో తెలుగోడ

ఎగువనున్న నేమిరా - దిగువనున్న నేమిరా
తాగునీరు ఒక్కటే - సాగునీరు ఒక్కటే
మాండలికం మారినా - తెలుగు భాష ఒక్కటే
యాసలెన్నివున్నను - గొంతు కలిపి నడవరా

తెలుగు భాష ఒక్కటే - తెలుగు జాతి ఒక్కటే
తెలుసుకొని మసులుకో తెలుగోడ - తెలివిగా నడచుకో తెలుగోడ

కష్టజీవి ఎక్కడున్న కాయకష్టమొక్కటే
స్వార్దశక్తులేవైనా దోచుకొనుట తద్యమే
రాష్ట్రాలు రొండైనా - తెలుగు భాష ఒక్కటే
నిండు మనసుతోనీవు -ఒక్కటై సాగర

తెలుగు భాష ఒక్కటే - తెలుగు జాతి ఒక్కటే
తెలుసుకొని మసులుకో తెలుగోడ - తెలివిగా నడచుకో తెలుగోడ

తమ సంపద కోసమై విభజించే నీతిరా
తమవారల భోగముకై పాలించే దొరలురా
ప్రాంతాలుగ విడిపోయిన - తెలుగుభాష ఒక్కటే
సమభావన ఎదనిండగ - చేయిచేయి కలపరా

తెలుగుభాష ఒక్కటే - తెలుగు జాతి ఒక్కటే
తెలుసుకొని మసులుకో తెలుగోడ - తెలివిగా నడచుకో తెలుగోడ

అల్లూరి మనవాడే - కొమరం బీమ్ తెలుగోడే
తిక్కనైన పోతనైన - వేమనైన తెలుగోడే
జన్మించినదెక్కడైన - తెలుగుభాష ఒక్కటే

తెలుగుతనం వెలుగింటన - ప్రమిదలై నిలవరా
తెలుసుకొని మసులుకో తెలుగోడ - తెలివిగా నడచుకో తెలుగోడ
                                                                                                                         - పిఎన్ మూర్తి
                                                                                                                        (9441151762)


Wednesday 19 November 2014

స్థిరమగు చిత్తము లేని వారికి

స్థిరమగు చిత్తము లేని వారికి
సుద్దులు చెప్పిన వ్యర్ధంబేగాని
బుద్దిగ మసలురగా ! కుదురుగ

లేని కుండన నీరు నిలవదు సుజనులారా...

Tuesday 18 November 2014

మేకతోలు కప్పుకొన్న బెబ్బులి .....

మేకతోలు కప్పుకొన్న బెబ్బులి ఆకు
మేయుననుట భ్రమయెగాద! జనస్వామ్య
ముసుగులో దొంగ దొరలపాలన దొడ్డదా!
కనుగొన వినదగు సత్యమిది సుజనులారా!

Sunday 9 November 2014

చైతన్య సేద్యం
చైతన్య సేద్యమె చేపట్టు రైతన్న
చీడపీడలనెల్ల తొలగించరోయన్న
ఈతిబాధలు లేని సాగునె సాధించు
ప్రకృతి వనరులే కాపాడు రోయన్న
|| చైతన్య సేద్యమె||

కృత్రిమ ఎరువులు కొంపకూల్చెరన్న
భూసారమంతా బూడిదయ్యేరన్న
ఏకపంటల తీరు వెతలు పెంచేరన్న
పంటమార్పిడి తోనె ఫలితమొచ్చెనన్న
|| చైతన్య సేద్యమె||

సేంద్రీయ సాగులో మేలున్నదన్నా
సహాజ ఎరువులకేది సాటి లేదన్న
సిరులు పండే పంట సాధించరన్న
నేలమ్మ అణువణువు పులకించురన్న
|| చైతన్య సేద్యమె||

పెట్టుబడులు నీకు పెనుభారమవ్వని
బ్రోకర్ల బెడద ఇక వుండబోని
అమ్మేటి పంటకు గిట్టుబాటుండేటి
మార్కెట్టు కొరకు సాగాలి రైతన్న
|| చైతన్య సేద్యమె||

రైతన్న బతుకును మట్టిగొట్టేటి
వినియోగదారులను కొల్లగొట్టేటి
కార్పొరేటు దొరల లాభాలె పెంచేటి
వ్యవసాయ పద్దతులు వదిలిపెట్టాలన్న
|| చైతన్య సేద్యమె||

పాడి పంటల పసిడి పండించు రైతన్న
పల్లె సీమల ప్రగతి సాధించు రైతన్న
ఆత్మహత్యల పీడ వదిలించరన్న
శాస్త్రీయ సేద్యమే శరణోయి రైతన్న

-పిఎన్. మూర్తి  9441151762
pnmoor@gmial.com,
pnmvijya.blogspot.com

Thursday 6 November 2014

బతక నీయండయ్య బతుకమ్మను

ఓ అన్న లారా ! ఓ అక్కలారా

పి .ఎన్ మూర్తి
ph : 9441151762

మా అమ్మ బొడ్డెమ్మ – ఓ అన్న లారా ! ఓ అక్కలారా
పుట్టనీయండయ్య బొడ్డెమ్మను -ఓ అన్న లారా ! ఓ అక్కలారా
మా అమ్మ బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా
బతక నీయండయ్య బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా


బంగారు గౌరమ్మ కనువిందుగా
తెలంగాణ మాగాణి సిరి పండగా
తెనుగింట బతుకమ్మ తొలి పండగై
శ్రీలక్షి ప్రతియింట కొలువవ్వగా

నా తల్లి నిలువెల్ల పుల్లకించగా
నేలమ్మ అణువణువు రవళించగా
నవమాసముల ఫలము ప్రసవించగా
నలుగురండగ నిలివాలి బొడ్డెమ్మకు

మొగ్గ తొడిగిన పువ్వు వికసించగా
చదువులా నా తల్లి దీవించగా
సకల విద్యలు నేర్చి రాణించగా
పదుగురు మెచ్చరే బొడ్డెమ్మను

సమక్కసారక్క మది నిండుగా
అయిలమ్మ సాహాసం కలపండగా
రాణిరుద్రమదేవి యదనుండగా
కొత్త ఆశల సమత జనపండగా.....


మా అమ్మ బొడ్డెమ్మ – ఓ అన్న లారా ! ఓ అక్కలారా
పుట్టనీయండయ్య బొడ్డెమ్మను -ఓ అన్న లారా ! ఓ అక్కలారా
మా అమ్మ బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా

బతక నీయండయ్య బతుకమ్మను - ఓ అన్న లారా ! ఓ అక్కలారా 

అధికార మదం బెక్కిన ప్రభువులు

ఆకలిగొన్న మృగంబు పండగ అని
జాలిని చూపదయా! అధికార మదం
బెక్కిన ప్రభువులు ధరలను దండిగపెంచగ
పర్వదినంబని ఎంచరుగా సుజనులారా!

చెడుటెంత సులువుగదా

మంచి బోధనలు చెవులకింపు చేయు
మంచిని ఆచరించు మనిషి మహిని అరుదు
చెడు మాటలాడుట చెడ్డకష్టమైన తాను
చెడుటెంత సులువుగదా! సుజనులారా!

మంట గలిపెడి మృగమతండు

కూడు, గుడ్డ, గూడుకూర్చని అంట
రానితనమున అంటకాగెడి మానవుండే
మానవత్వం మంట గలిపెడి మృగమతండు
అశాంతి కారకుండే సుజనులారా!

నోరుమెదపనినాడు

ఉగ్రవాదులకన్న, ఉన్మాదులకన్న
జనకంటకులకన్న, అంటువ్యాధికన్న
నోరుమెదపనినాడు ముప్పుదెచ్చును
వాడు!వినదగు సత్యమిది సుజనులారా!

అవినీతి

మురుగున పొర్లెడి పందులు పన్నీరున్
మెచ్చగరావు, అవినీతి కూపమందున్న
అక్రమార్జకులు నీతినేనోర్చరయా!
వినదగుసత్యమిది సుజనులారా

Wednesday 5 November 2014

ఈనాడు తలగొట్టినట్లాయె..

స్వరాజ్యపు తొలిదినములందు త్రాగినారనినిందబడిన తలదీసి నట్లాయె, త్రాగలేదనిపలికితే, ఈనాడు తలగొట్టినట్లాయెకనుగొన వినదగు సత్యమిది సుజనులారా!  

నేనామాటకు కట్టుబడితిని..

నేనిచ్చిన మాటకు కట్టుబడి, నేనా
నేస్తముకై, నా ఆస్తుల నమ్మితి, నైనా
నే నిందలబడి చచ్చితి, నైనా! నేటికిన్
నేనామాటకు కట్టుబడితిని సుజనులారా!  

సమతకు అర్పితమైనవి నాప్రాణముల్..

వీనుల విందొనర్చునా పద్యముల్,
పరులకుపకార మొనర్చు నాచర్యలు
సమతకు అర్పితమైనవి నాప్రాణముల్
నను సందేహింపకుడీ సుజనులారా!  

శాంతి సుమం


విశ్వమాత హృదయంలొ శాంతి సుమం నాకవిత
భరతమాత తలపులలో ప్రగతి పదం నాకవిత
తెలుగుతల్లి అణువణువున క్రాంతి కధం నాకవిత
జన గుండెల మందిరాన జానపదం నాకవిత
త్యాగ ధనుల పరమార్ధం కీర్తించే నాపాట
చిరునవ్వుల పసిపాపల జోలపాట – నాపాట
మనవీరుల సాహసాలు ఎలుగెత్తిన – నాపాట
మహానీయుల విలువలను చాటించె-నాపాట
చైతన్యం చిగురించగ పోరుబాట – నాపాట
రైతన్నలు ఉద్యమించ ఏరువాక నాపాట
శ్రామికజన జీవితాల మార్పురేఖ – నాపాట
కష్టజీవి కన్నులలో ఎర్రజీర – నాపాట
అణగారిన మహిళలకు తెగవనిచ్చె నాపాట
రగులుతున్న గుండెలలొ మరుగుతున్న – నాపాట
కన్నీటి కడిలిలొ దిక్సూచే నాపాట
ఆకలి మెలిపేగులలొ పొలికేకె నాపాట
నదీనదుల పరవళై ప్రవహించె నాపాట
కొండల సెలయేటిలా జాలువారు జనపాట
జాబిలమ్మ వెన్నెలలో చల్లదనం -నాపాట
విప్లవాల విరితోటలొ-మొగ్గతొడిగె తొలిపాట
పి.ఎన్.మూర్తి -9441151762

సుజనులారా..!


బద్దెన,వేమన,భాస్కర శతకముల్
బహు చక్కగ చదివితి, మిక్కిలి మక్కువ
తోడ,నేనీ కవితామాలిక అల్లితి,గ్రక్కున
మీ అక్కున చేర్చుకొనిడీ సుజనులారా!

Monday 3 November 2014

బతుకమ్మ తోట

 పిఎన్ మూర్తి
9441151762
mial: pnmoor@gmail.com

స్ర్తీ పురుష బేధాలు మాకుండవంటూ
బతుకమ్మ తోటలో తంగేడుపూలతో
చిలుకమ్మ చెప్పింది....-మురిపంగ పలికింది..... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

జాతి రంగుల తేడ మాకుండదంటూ
బతుకమ్మ తోటలో మందార పూలతో
కోకిలా కూసింది...గొంతెత్తి పాడింది... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

కలసి నడిచే నడత మాకున్న దంటూ
బతుకమ్మ తోటలో చేమంతి పూలతో
కుందేలు చెప్పింది మనసిప్పి నవ్వింది... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

తరతమా భేదాలు తనకసలు లేదంటు
బతుకమ్మ తోటలో పూబంతి పూలతో
చిరుగాలి చెప్పింది హాయిగా వీచింది.... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

జగమంత తానై వెలుగిస్తనంటు
బతుకమ్మ తోటలో గునగమ్మ పూలతో
వెలుగమ్మ చెప్పింది ఎలుగెత్తి చాటింది... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

తాగేటి నీటికి అంటుండదంటూ
బతుకమ్మ తోటలో గుమ్మడీ పూలతో
వాగమ్మడే చెప్పి గలగలా పారింది. ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

విత్తేది ఏదైనా - మొలిపిస్తనంటు
బతుకమ్మ తోటలో -బీరమ్మ పూలతో
నేలమ్మ నుడివింది -గర్వంగ పలికింది... ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా

చదివేటి నా చిన్ని చదువు ఆపాకమ్మా....
పుట్టినా చిన్నారి ప్రాణాలు నిలబెట్టరమ్మా.....
బ్రతుకిచ్చి బ్రతికించు మనుసున్న మనిషి ఓ పాల పిట్టా - ఓజమ్మి చెట్టా


Sunday 2 November 2014

విప్లవాల విరితోటలొ-మొగ్గతొడిగె తొలిపాట



విశ్వమాత హృదయంలొ శాంతి సుమం నాకవిత
భరతమాత తలపులలో ప్రగతి పదం నాకవిత
తెలుగుతల్లి అణువణువున క్రాంతి కధం నాకవిత
జన గుండెల మందిరాన జానపదం నాకవిత
త్యాగ ధనుల పరమార్ధం కీర్తించే నాపాట
చిరునవ్వుల పసిపాపల జోలపాట – నాపాట
మనవీరుల సాహసాలు ఎలుగెత్తిన – నాపాట
మహానీయుల విలువలను చాటించె-నాపాట
చైతన్యం చిగురించగ పోరుబాట – నాపాట
రైతన్నలు ఉద్యమించ ఏరువాక నాపాట
శ్రామికజన జీవితాల మార్పురేఖ – నాపాట
కష్టజీవి కన్నులలో ఎర్రజీర – నాపాట
అణగారిన మహిళలకు తెగవనిచ్చె నాపాట
రగులుతున్న గుండెలలొ మరుగుతున్న – నాపాట
కన్నీటి కడిలిలొ దిక్సూచే నాపాట
ఆకలి మెలిపేగులలొ పొలికేకె నాపాట
నదీనదుల పరవళై ప్రవహించె నాపాట
కొండల సెలయేటిలా జాలువారు జనపాట
జాబిలమ్మ వెన్నెలలో చల్లదనం -నాపాట
విప్లవాల విరితోటలొ-మొగ్గతొడిగె తొలిపాట
పి.ఎన్.మూర్తి -9441151762