Sunday 9 November 2014

చైతన్య సేద్యం
చైతన్య సేద్యమె చేపట్టు రైతన్న
చీడపీడలనెల్ల తొలగించరోయన్న
ఈతిబాధలు లేని సాగునె సాధించు
ప్రకృతి వనరులే కాపాడు రోయన్న
|| చైతన్య సేద్యమె||

కృత్రిమ ఎరువులు కొంపకూల్చెరన్న
భూసారమంతా బూడిదయ్యేరన్న
ఏకపంటల తీరు వెతలు పెంచేరన్న
పంటమార్పిడి తోనె ఫలితమొచ్చెనన్న
|| చైతన్య సేద్యమె||

సేంద్రీయ సాగులో మేలున్నదన్నా
సహాజ ఎరువులకేది సాటి లేదన్న
సిరులు పండే పంట సాధించరన్న
నేలమ్మ అణువణువు పులకించురన్న
|| చైతన్య సేద్యమె||

పెట్టుబడులు నీకు పెనుభారమవ్వని
బ్రోకర్ల బెడద ఇక వుండబోని
అమ్మేటి పంటకు గిట్టుబాటుండేటి
మార్కెట్టు కొరకు సాగాలి రైతన్న
|| చైతన్య సేద్యమె||

రైతన్న బతుకును మట్టిగొట్టేటి
వినియోగదారులను కొల్లగొట్టేటి
కార్పొరేటు దొరల లాభాలె పెంచేటి
వ్యవసాయ పద్దతులు వదిలిపెట్టాలన్న
|| చైతన్య సేద్యమె||

పాడి పంటల పసిడి పండించు రైతన్న
పల్లె సీమల ప్రగతి సాధించు రైతన్న
ఆత్మహత్యల పీడ వదిలించరన్న
శాస్త్రీయ సేద్యమే శరణోయి రైతన్న

-పిఎన్. మూర్తి  9441151762
pnmoor@gmial.com,
pnmvijya.blogspot.com

No comments:

Post a Comment